
చదువుతోనే పేదరికం దూరం
మన్ననూర్: పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులంతా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని గిరిజన గురుకులాల ముఖ్య కార్యదర్శి డాక్టర్ శరత్ సూచించారు. పేదరికాన్ని దూరం చేసుకోవడానికి చదువే ముఖ్య సాధనమన్నారు. మన్ననూర్‌లోని ఆదిమజాతి గురుకుల పాఠశాల, కళాశాలను (పీటీజీ) బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా 7వ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థి దశలో లక్ష్యం నిర్ధేశించుకొని, దానిని సాధించేందుకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యార్థులు లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అదనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన పరిశీలించారు.
ఉపాధ్యాయులే మార్గనిర్ధేశకులు
విద్యార్థులు సహజంగా ఉపాధ్యాయులను అ నుకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో ఉండటంతో పాటు సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. వస తి గృహంలో విద్యార్థుల కోసం తయారు చేసి న వంటను రుచి చూశారు. ప్రభుత్వం నూత నంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్నాక్స్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య తలెత్తినా సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్సీఓ సుధాకర్, ఏపీఓ యాదమ్మ, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
రోస్టర్ విధానంతో
మాలలకు అన్యాయం
మన్ననూర్: సుప్రీం కోర్టు సూచనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి, కుమ్మరోనిపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అమ్రాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూరుగు వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి మాలలను 3వ గ్రూప్‌లో ఉంచి 5 శాతం రిజర్వేషన్ కేటాయించారన్నారు. అది కూడా మాలలకు పూర్తి స్థాయిలో దక్కకుండా కుట్ర పూరితమైన రోస్టర్ విధానం అమలులోకి తేవడం దురదుష్టకరమని మండిపడ్డారు. దీంతో మాల విద్యార్థి, నిరుద్యోగులకు తీరని నష్టం కలిగించేదిగా ఉన్న రోస్టర్ విధానాన్ని తక్షణమే సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన గ్రూప్ 3తో పాటు శాతవాహన యూనివర్సిటీ ఉద్యోగాల్లో గ్రూప్ 3లో 5 శాతంగా ఉన్న మాలలకు ఒక్క ఉద్యోగం కూడా కేటాయించ లేదంటే రోస్టర్ విధానం ఎంత లోపాభూయిష్టంగా ఉందనేది ఇట్టే అర్థమవుతుందన్నారు.
రద్దు చేయాలి
మాలలకు శాపంగా మారిన రోస్టర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటూ మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్, నాసరయ్య, బాలస్వామి, బాలకిష్టయ్య, జక్క గోపాల్, పెర్ముల రాజేష్, శ్రీనివాస్, శ్రీకాంత్, కుమార్, నంద, రాముడు, రామాంజనేయులు, పాండు పాల్గొన్నారు.
ఈవీఎంలకు పటిష్ట భద్రత
గద్వాల: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈఓ, ఈవీఎంల నోడల్ అధికారి హరిసింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోదాంలో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంలను రాష్ట్రస్థాయి బృందంతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, ఎన్నికల విభాగం సూపరిండెంట్ కరుణకర్, సురేష్ పాల్గొన్నారు.

చదువుతోనే పేదరికం దూరం