
రూ.150 కోట్లు.. 22 ఎకరాల విస్తీర్ణం..
సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, డిజిటల్ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, విశాలమైన, విభిన్న రకాల ప్లేగ్రౌండ్స్‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జిల్లాలో కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లాలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తయితే జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్య అందనుంది. జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్ల ఖర్చుతో జటప్రోలులోని సర్వే నంబర్ 176, 177లో 22 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల భవనాలు, హాస్టళ్లు, మైదానాలు తదితర వసతులు ఏర్పాటు చేయనున్నారు.
పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలులో నిర్మాణం
ఈనెల 18న భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

రూ.150 కోట్లు.. 22 ఎకరాల విస్తీర్ణం..