
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు
● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి
● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ
నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్‌బజార్‌లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్‌లో వృథాగా ఉన్న ఓ భవనంలోని మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుం వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరుచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు.
ఉత్సాహభరితంగా..
గద్వాల బాలభవన్‌లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్‌లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం

చిన్నారుల పొదరిల్లు

చిన్నారుల పొదరిల్లు