సేవలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

సేవలు మెరుగు

May 24 2025 12:08 AM | Updated on May 24 2025 12:08 AM

సేవలు

సేవలు మెరుగు

టీహబ్‌తో

ఎంతో మేలు..

టీహబ్‌ ద్వారా కార్పొరేట్‌ స్థాయిలో రూ.వేలు విలువ చేసే రక్త పరీక్షలను ఉచితంగా రోగులకు అందిస్తున్నారు. ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో చేయని రక్త పరీక్షలను సైతం టీహబ్‌ ద్వారా అందిస్తున్నారు. ఇటీవల సీటీ స్కాన్‌ సేవలు సైతం అందుబాటులోకి తీసుకురావడంతో రోడ్డు ప్రమాద బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది.

– గోవర్ధన్‌, నాగర్‌కర్నూల్‌

సేవలు వినియోగించుకోండి..

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాం. టీహబ్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో రూ.వేలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు టీహబ్‌ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. టీహబ్‌ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

– రఘు, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఏదైనా జబ్బు చేసి ఆస్పత్రికి వెళ్తే వైద్యం కన్నా.. వైద్య పరీక్షలకే ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రోగికి వచ్చిన రోగాన్ని గుర్తించేందుకు రక్త పరీక్ష, మూత్ర పరీక్షలతోపాటు ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా రక్త పరీక్షల నుంచి ఇతర పరీక్షలు లేనిదే వైద్యం చేయడం లేదు. రోగాన్ని తగ్గించేందుకు మందులను రాయడం లేదు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు వెళ్లాలంటే ఏ పరీక్ష చేయాలన్న చాలా రూ.వేలతో కూడుకున్న వ్యవహారం కావడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన టీహబ్‌ సత్ఫలితాలు ఇస్తుంది. రెండున్నరేళ్ల క్రితం మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ వద్ద ఏర్పాటు చేసిన టీహబ్‌లో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వైద్య పరికరాలతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో రూ.వేలు వెచ్చించి చేసే రక్త పరీక్షలతోపాటు ఇతర పరీక్షలను టీహబ్‌లో ఉచితంగా చేస్తుండటంతో సామాన్య ప్రజలు ఆర్థిక భారం నుంచి విముక్తి పొందుతున్నారు.

శాంపిళ్లు సేకరించి..

జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతోపాటు జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన రోగులకు రక్త పరీక్షలు రాస్తుండటంతో వైద్య సిబ్బంది శాంపిళ్లు సేకరించి టీహబ్‌కు పంపిస్తున్నారు. ప్రతిరోజు టీహబ్‌లో వెయ్యి మందికి పైగా రక్త పరీక్షలు నిర్వహిస్తూ రిపోర్టులను సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారు.

జిల్లాకేంద్రంలో

టీహబ్‌ భవనం

రూ.లక్షలు వెచ్చించి అత్యాధునిక పరికరాల ఏర్పాటు

నిత్యం వెయ్యిమంది వరకు

రక్త, ఇతర పరీక్షలు

కార్పొరేట్‌ స్థాయిలో

అందుబాటులోకి ఉచిత వైద్యం

జిల్లాలో నిరుపేదలకు తప్పిన ఆర్థిక భారం

సద్వినియోగం చేసుకుంటున్న పేద ప్రజలు

అత్యాధునిక మిషనరీలు..

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయలేని కొన్ని రక్త పరీక్షలను సైతం టీహబ్‌లో ఉచితంగా చేస్తూ రిపోర్టులు త్వరగా అందజేస్తున్నారు. టీ హబ్‌లో 28 రకాల వైద్యానికి సంబంధించిన అత్యాధునిక మిషనరీలు ఏర్పాటు చేసి 136 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉండటంతో టీహబ్‌కు సంబంధించి మైక్రో బయాలజిస్టు వైద్యులు సైతం అందుబాటులో ఉంటూ రక్త పరీక్షల రిపోర్టులను పరిశీలిస్తూ రోగులకు కచ్చితత్వంతో కూడిన రిపోర్టులు అందిస్తున్నారు.

సీటీ స్కాన్‌ సేవలు సైతం..

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితోపాటు ఇతర రోగులకు టీహబ్‌ ద్వారా సీటీ స్కాన్‌ సేవలు అందిస్తున్నారు. సీటీ స్కాన్‌లో రోగులకు చేసిన వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులను ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌కు పంపించి టెలీ రేడియాలజిస్టులు క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాత రోగులకు వైద్యం అందిస్తున్నారు. రేడియాలజిస్టుల కొరత ఉండటంతో టెలీ రేడియాలజిస్టు ద్వారా టీహబ్‌ సేవలు అందిస్తుంది.

సేవలు మెరుగు 1
1/3

సేవలు మెరుగు

సేవలు మెరుగు 2
2/3

సేవలు మెరుగు

సేవలు మెరుగు 3
3/3

సేవలు మెరుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement