
అచ్చంపేటలో జాతీయ పతాకం రెపరెపలు
అచ్చంపేట రూరల్: జమ్ముకాశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావం శుక్రవారం అచ్చంపేటలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా పాల్గొన్న ప్రజలు, రాజకీయ, సంఘాల నాయకులు జాతీయ పతాకాన్ని చేతపట్టి ర్యాలీలో ముందుకు సాగారు. అలాగే భారత్ మాతాకీ జై.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పలువురు రిటైర్డ్ ఆర్మీ అధికారులను సన్మానించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, టీచర్లు, మహిళా, హమాలీ సంఘాల నాయకులు, కోలాట బృందం, న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఇతర ప్రొఫెషనల్స్, వేలాదిగా ప్రజలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాములు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్‌రెడ్డి, భరత్ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగ్యానాయక్, రైల్వే బోర్డు మెంబర్ ధర్మనాయక్, పార్లమెంట్ కన్వీనర్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు బాలాజీ, రేనయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జానకమ్మ, జిల్లా కార్యదర్శి శీనునాయక్, సైదులు, పెద్దయ్యయాదవ్, చందులాల్ చౌహాన్, మైనార్టీ అధ్యక్షులు సిద్ధిఖి పాషా తదితరులు పాల్గొన్నారు.