
రేపు డిప్యూటీ సీఎం రాక
బల్మూర్: మండలంలోని గట్టుతుమ్మెన్ గ్రామానికి సోమవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం గట్టుతుమ్మెన్‌లో ఏర్పాటు చేయనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం నియోజకవర్గ ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు గిరివర్ధన్‌గౌడ్, కాశన్నయాదవ్, గోపాల్‌రెడ్డి, రాంప్రసాద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల హెడ్‌ఓడీలతో మాట్లాడుతూ వైద్య కోసం వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలన్నారు. జనరల్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ వైద్యుడు గురువారం రాజీనామా చేయడంతో ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా రాజీనామా చేసినట్లు దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘటనపై విచారణ చేసేందుకు జనరల్ ఆస్పత్రికి వచ్చారు. రాజీనామా చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడితో వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిసింది. అనంతరం ఉయ్యాలవాడ వద్ద ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించారు. అకాడమిక్ డీఎంఈ వెంట ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు తదితరులున్నారు.
ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలం
● మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి
● హక్కుల సాధన కోసం పోరాడుదాం
● కవిత లేఖపై కేసీఆర్ స్పందించాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– కల్వకుర్తి రూరల్
– వివరాలు 8లో..