
సంస్కృతి, సంప్రదాయాలు ఆచరించాలి
అచ్చంపేట/అచ్చంపేట రూరల్: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ఎంతో శ్రేష్టమైనవని హంపీ పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి అన్నారు. బుధవారం అచ్చంపేటలో బొడ్రాయి (నాభిశిల), పోచమ్మ ఆలయ పునః నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. పురాతన బొడ్రాయిని జీర్ణోద్ధారణ చేసి భ్రమరాంబ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. ఆచార వ్యవహారాలతో పాటు ధర్మబద్ధమైన నియమాలతో జీవనాన్ని కొనసాగించాలని, పాశ్ఛాత్య సంస్కృతిని విడనాడాలని సూచించారు. నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.