
యూడైస్ కచ్చితమేనా..?
ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం సేకరణ
ప్రతిరోజు రెండు పాఠశాలలు..
జిల్లాలో సర్వే కోసం 759 పాఠశాలలను ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ డైట్ కళాశాలకు చెందిన 77 మంది డైట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి పదేసి పాఠశాలలు కేటాయించారు. ప్రతిరోజు రెండేసీ పాఠశాలల చొప్పున బుధవారం నుంచి ఈ నెల 22 వరకు సర్వే చేసేలా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించారు. ఇందులో కేజీబీవీ, ఆదర్శ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండే విధంగా చూశారు. క్లస్టర్ రిసోర్స్‌పర్సన్ల సహకారంతో సర్వే కొనసాగుతుంది. యూడైస్‌లో పొరపాట్లు ఉంటే సరిచేసి.. సర్వే పూర్తయిన తర్వాత తుది నివేదికను జిల్లా విద్యాధికారులకు అందిస్తారు.
అచ్చంపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల సమగ్ర సమాచారం సేకరించేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టింది. డైట్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతి విద్యా సంవత్సరంలో పాఠశాలల సమగ్ర సమాచారాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం (యూడైస్)లో నమోదు చేస్తున్నారు. వీటిని కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, ఎంఈఓల పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు, పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను ప్రామాణికంగా తీసుకుంటుంది. స్కూళ్లలో సరైన మౌలిక వసతులు లేవని కేంద్రం కొన్నేళ్లుగా చెబుతోంది. అయితే ఈ వివరాలు కచ్చితంగా, పారదర్శకంగా పొందుపరుస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని విద్యాశాఖ తొలిసారిగా డైట్ విద్యార్థులతో సర్వేకు చర్యలు చేపట్టింది.
77 మంది డైట్ విద్యార్థులతో రేపటి వరకు సర్వే
జిల్లావ్యాప్తంగా 759 పాఠశాలల ఎంపిక
ఈ నివేదిక ప్రామాణికంగానే నిధుల కేటాయింపు

యూడైస్ కచ్చితమేనా..?