చిలుకపచ్చ చీర | - | Sakshi
Sakshi News home page

చిలుకపచ్చ చీర

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

ప్రత్యేక డిజైన్‌ జిల్లా వ్యాప్తంగా 70,876 మంది మహిళలు

చీరలు రావాల్సిన మండలాలు,

సభ్యుల వివరాలు

మండలాలకు చేరుకున్న చీరలు,

సభ్యుల వివరాలు

ఆడబిడ్డలకు..

● జిల్లాకు చేరుతున్న బతుకమ్మ కానుక

● 70,876 మంది మహిళలు..

● వచ్చిన చీరలు 36,865..

రావాల్సింది 41,098

గోవిందరావుపేట: రాష్ట్రం ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగ కానుకగా అందించే చిలుకపచ్చ చీరలు జిల్లాకు చేరుతున్నాయి. జిల్లా పరిధిలోని ఇప్పటి వరకు నాలుగు మండలాలకు సంబంధించిన చీరలు ఆయా మండలాలకు చేరగా మిగితా మండలాలకు చేరాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల్లోని 77,963 మంది మహిళలకు చీరలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 36,865 చీరలు ఆయా మండలాలకు చేరాయి. ఇంకా 41,098 చీరలు రావాల్సి ఉంది. సద్దుల బతుకమ్మకు ముందుగానే చీరలు మహిళలకు పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఈసారి మహిళలకు అందించే బతుకమ్మ చీరలను చిలుకపచ్చ రంగులో రూపొందించారు. చీరపై ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అంచులో ప్రత్యేక బార్డర్‌ ఉండేలా నమూనాను సిద్ధం చేశారు. పండుగ వాతావరణానికి అనుగుణంగా సంప్రదాయ శైలిని ప్రతిబింబించేలా చీరల రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ రంగులు, డిజైన్లలో చీరలు అందించగా.. ఈదఫా మహిళా సంఘాల సభ్యులకు ఓకే తరహా నమూనాలో చీరలు అందించనున్నారు. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ చీరలను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లా పరిధిలో 341 వీఓలు ఉండగా 7,368 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,962 సాధారణ స్వయం సహాయక సంఘాలు ఉండగా 202 పీడబ్ల్యూడీ(దివ్యాంగులు), 204 ఎల్డర్‌ ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తంగా 70,876 మహిళలు సభ్యులుగా ఉన్నారు. సభ్యుల సంఖ్యకు 10శాతం అదనంగా కలిపి జిల్లాకు 77,963 చీరలు అవసరమని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా ప్రస్తుతం ములుగు, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, వెంకటాపురం(ఎం) మండలాలకు 36,865 చీరలు చేరుకున్నాయి. ఇంకా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాలకు సంబంధించిన చీరలు రావాల్సి ఉంది.

మండలం సభ్యులు రావాల్సిన చీరలు

ఏటూరునాగారం 7,394 8,133

మంగపేట 12,281 13,509

వెంకటాపురం 7,645 8,410

వాజేడు 5,859 6,445

కన్నాయిగూడెం 3,233 3,556

మండలం సభ్యులు వచ్చినవి రావాల్సినవి

ములుగు 12,593 13,852 0

గోవిందరావుపేట 7,640 8,404 0

ఎస్‌ఎస్‌తాడ్వాయి 6,012 5,568 1,045

వెంకటాపురం(ఎం) 8,219 9,041 0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement