సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి

Oct 5 2026 1:15 AM | Updated on Oct 5 2026 1:15 AM

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.సంపత్‌నాయక్‌ తెలిపారు. మండల పరిధిలోని మేడారంలోని జంపన్న వసతి సముదాయంలో ఆదివారం నిర్వహించిన సర్పంచ్‌ల చైతన్య సదస్సులో జిల్లా సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముషినెపల్లి కుమార్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడిగా దేవులపల్లి విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా నాగిడి రమణారెడ్డి, అధికార ప్రతినిధిగా జాడి రాంబాబు, కార్యదర్శులుగా మొగిలిపల్లి రవీందర్‌, లావుడ్య జోగానాయక్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్‌లకు నెలకు రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దుపై సానుకూలంగా స్పందించడంతో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ల ఫోరం నూతన అధ్యక్షుడు కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ల హక్కుల సాధనకు నిరంతరం పోరా డుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement