ఏటూరునాగారం: మధ్యాహ్న భోజన కార్మికుల అల్పాహారం పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులను రోడ్డున పడేస్తూ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని అమలు చేసే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి మనస్సు మార్చుకోవాలని కోరారు. ఈ మేరకు ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చాంద్ పాషా, కొమురయ్య, సమ్మక్క, సులోచన పాల్గొన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రవీందర్


