నాగేందర్‌కు డాక్టరేట్‌ ప్రదానం | - | Sakshi
Sakshi News home page

నాగేందర్‌కు డాక్టరేట్‌ ప్రదానం

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

ములుగు రూరల్‌: మండల పరిధిలోని పత్తిపల్లి గ్రామానికి చెందిన గద్దల నాగేందర్‌ వ్యవసాయ శాస్త్రంలోని అగ్రానమీ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి, గవర్నర్‌ రమేన్‌ దేకా, వ్యవసాయశాఖ మంత్రి రామ్‌ విచార్‌నేతమ్‌, ఇందిరా గాంధీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ గిరిష్‌చందేల్‌ సమక్షంలో డాక్టరేట్‌ను ఆదివారం ప్రదానం చేశారు. గోదుమ పంటలో కలుపు మొక్కల నియంత్రణ పద్ధతులు, పంట వృద్ధి, దిగుబడిపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసి సమర్పించిన సిద్ధాంత గ్రంధానికి డాక్టరేట్‌ను నాగేందర్‌ అందుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన గద్దల భిక్షపతి–లక్ష్మీ కుమారుడు నాగేందర్‌ వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించడంతో గ్రామస్తులతో పాటు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement