అంత్య పుష్కరాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలకు ఆహ్వానం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాలకు రావాలని హైదరాబాద్‌లో పలువురు మంత్రులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రికను శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ అందజేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్కకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేవాదాయ శాఖ ధార్మిక సలహాదారు గోవింద హరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాస్‌లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. వారివెంట ఆలయ ఈఓ మహేష్‌, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్‌, పాండాలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement