ఓటరు జాబితా సవరణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణ ప్రారంభం

May 17 2026 12:54 AM | Updated on May 17 2026 12:54 AM

వీసీలో సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

ములుగు: రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక ముమ్మర ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం బీఆర్‌కే భవన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో అదనపు సీఈఓ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శంకర్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జూన్‌ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి గుర్తింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేసుకోవచ్చన్నారు. జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు నోటీసులు జారీ, విచారణ, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఆక్టోబర్‌ 1న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఈ ప్రత్యేక సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ములుగు తహసీల్దార్‌ విజయ భాస్కర్‌, ఎలక్షన్‌ సెల్‌ తహసీల్దార్‌ సలీం, డీటీ నితీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement