పనులకు కేటాయింపులిలా..
ఎప్పుడు పూర్తయ్యేనో..
సాగుతున్న పనులివే..
గోదావరిలో మట్టిరోడ్డు పనులు
ముద్దులపల్లి అటవీప్రాంతంలో అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణాలు
ఆలయంలో క్యూలైన్
పనులు చేస్తున్న కూలీలు
శాఖ కేటాయింపు (రూ..)
ఇరిగేషన్ 62.20 లక్షలు
ఆర్‌అండ్‌బీ 51 లక్షలు
పంచాయతీరాజ్ 34.8లక్షలు
ఈఈ ఎంబీ ఇన్‌ఫ్రా 15 లక్షలు
ఆర్టీసీ 17 లక్షలు
డీపీఓ 97.42 లక్షలు
ఎండోమెంట్ 67.74 లక్షలు
డీఎఫ్‌ఓ 5.92 లక్షలు
సబ్‌కలెక్టర్ 15 లక్షలు
అటవీ 30 లక్షలు
ఎస్పీ 1.25 కోట్లు
కలెక్టర్ 6 కోట్లు
క్షేత్ర కన్సల్టెంట్ 17.70 లక్షలు
కాళేశ్వరం: ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం రూ.21.98కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వీఐపీ ఘాటు వద్ద ఈవెంట్ పనులు, పరిసరాల్లో మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు, బీటీ రోడ్డు, ఫార్మేషన్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు హడావిడి చేస్తున్నారు. దీంతో నాణ్యత, నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు మమా అనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇంకా ఐదు రోజుల్లో పనులు పూర్తి చేసేలా కనిపించడం లేదని భక్తులు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమి కొట్ట చ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి.
గోదావరి వద్ద డ్రెస్‌లు మార్చుకునే గదుల నిర్మాణం జరగడం లేదు.
ప్రధానఘాటు, సరస్వతీ ఘాటులో జల్లు స్నానాల పంపుల నిర్మాణం జరగడం లేదు.
చలువపందిర్ల పనులు ఇంకా మొదలు కాలేదు.
రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు.
అక్కడక్కడా సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
ఆదిముక్తీశ్వర నుంచి వీఐపీఘాటు వరకు చిప్స్ వేసి ఉంచగా, బీటీ మొదలు కాలేదు.
సరస్వతీఘాటు వద్ద కై ర్ మ్యాట్ వర్క్ మొదలు కాలేదు.
తాగునీరుకు ట్యాంకులు శుభ్రం చేస్తున్న ఏర్పాట్లు ఏవీ కనిపించడం లేదు.
మరుగుదొడ్ల పనులు పూర్తికాలేదు. అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి.
రూ.1.20కోట్లతో మ్యూజియం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పక్కనే అటవీశాఖ లాన్ పనులు సాగుతున్నాయి.
అటవీశాఖ ఆధ్వర్యంలో కుదురుపల్లి– బీరసాగర్ రోడ్డు పనులు జరుగుతున్నాయి.
260 ఎకరాల్లో పలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు చేపట్టారు.
మద్దులపల్లి, సుద్ద వాగుల వద్ద శిథిలావస్థకు చేరిన కల్వర్టులకు రంగులు అద్ది మెరిపిస్తున్నారు.
కాళేశ్వర పరిసరాల్లో సీసీ కెమెరాలు పనులు చేపట్టారు.
టెంట్‌సిటి పనులు, డార్మెటరీ పనులు జరుగుతున్నాయి.
ప్రముఖ సంస్థ సరస్వతీఘాటు వద్ద భారీ డెకరేషన్స్ చేపట్టింది.
కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్ పనులు జరగుతున్నాయి.
శివ కల్యాణ మండపంలో భారీ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడే హోమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
21నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు
రూ.21.98 కోట్లతో పనులు
నాణ్యతపై విమర్శలు


