ఇంధన భారం! | - | Sakshi
Sakshi News home page

ఇంధన భారం!

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

జిల్లాలో 53,430 వాహనాలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

జిల్లాలో పెట్రోల్‌ బంక్‌లు

వారానికి కావాల్సిన ట్యాంకర్లు

ఏటూరునాగారం: దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14లు పెంచడంతో సామాన్యులపై అదనపు భారం పడింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రావడంతో వినియోగదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత ప్రభావం చూపనుంది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయలు, ధాన్యాలు, ఇతర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో మధ్యతరగతి, పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు ఈ ధరలు పెంపుతో ఆర్థికంగా నష్టపోతున్నారు. డీజిల్‌ ధరలు పెరగడంతో వ్యవసాయ పనుల ఖర్చులు కూడా పెరిగి రైతులపై మరింత భారం పడుతోంది.

జిల్లాలో అన్ని రకాల వాహనాలు 53,430 ఉండగా వీటికి వారానికి 30 ట్యాంకర్ల డీజిల్‌, 20 ట్యాంకర్ల పెట్రోల్‌ అవసరం అవుతుంది. జిల్లాలో 19 ఐఓసీఎల్‌, 12 హెచ్‌పీసీఎల్‌ కంపెనీల బంక్‌లు ఉన్నాయి. ఇక పెరిగిన ధరలపై వామపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంధన ధరల పెంపు ప్రభావం సమాజంలోని అన్ని వర్గాలపై పడుతుండగా ప్రభుత్వం తక్షణ ఉపశమ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సామాన్యుడిపై అదనపు భారం

నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం

ఐఓసీఎల్‌: 19

హెచ్‌పీసీఎల్‌ : 12

డీజిల్‌: 30

పెట్రోల్‌: 20

జిల్లాలో అన్ని రకాల

వాహనాల సంఖ్య: 53,430

Advertisement
 
Advertisement
Advertisement