రోడ్డుకు ఇరువైపుల పెరిగిన ముళ్లపొదలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి వాజేడు మండలం పూసూరు వరకు 163 జాతీయ రహదారి వెంట ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోడ్డుపైకి ముళ్లపొదలు, చెట్లకొమ్మలు రావడంతో రోడ్డుపై వచ్చిపోయే వాహనాలు కనిపించే పరిస్థితి లేకుండా పోతుంది. చెట్ల కొమ్మలను తప్పించబోయి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని మృత్యువాత పడుతున్నారు. ఇలా అనేక సంఘటనలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
– ఏటూరునాగారం
రోడ్డుపైకి వచ్చిన చెట్ల కొమ్మలు


