ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

ములుగు రూరల్‌: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్ల లు ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని భవిత కేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ప్రతిభను గుర్తించి పోత్సహించాలన్నారు. వారికి ఇష్టమున్న రంగాల్లో పోత్సహించినట్లయితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. సమగ్ర శిక్ష, అలింకో సంయుక్తంగా విద్యార్థుల అవసరాలను బ ట్టి ఉపకరణాలను అందించారు. అలింకో సంస్థ జి ల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు అందించడం అభినందనీయమన్నా రు. తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలు కలిగిన వి ద్యార్థులను సమీప పాఠశాలలకు లేదా భవితకేంద్రాలకు పంపించాలని సూచించారు. వారికి అనుగుణంగా అభ్యసన పరికరాలు ఉన్నాయన్నారు. జి ల్లాలో 46 మంది విద్యార్థులకు 58 ఉపకరణాలు అందించారు. డీసీఈబీ సూర్యనారాయణ, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్‌ సాంబయ్య, సైకం శ్రీనివాస్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ఎంఈఓ తిరుపతి, అలింకో ప్రతినిధులు పట్నాయక్‌, గణేశ్‌ పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement