మొబైల్‌ మ్యూజియం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ మ్యూజియం ప్రారంభం

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

ములుగు రూరల్‌: గిరి దర్శక్‌ పర్యాటక మొబైల్‌ మ్యాజియాన్ని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గిరి దర్శక్‌ పర్యాటక గైడ్‌లకు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాను పర్యాటక రంగంలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. కర్రిగుట్టల ప్రాంతంలో పర్యాటక కేంద్రాల్లో గైడ్‌లుగా సేవలందించేందుకు ఎంపికై న యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లాలో రామప్ప, మేడారం, లక్నవరం, మల్లూరు, బొగత జలపాతం, చారిత్రక ప్రదేశాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ప్రాముఖ్యతను వివరించి పర్యాటక రంగంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. మొబైల్‌ మ్యూజియంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఛాయచిత్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటకుల అవసరమయ్యే సమాచారం, బ్రోచర్లు, సమాచార పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మమన్‌ భట్‌, డీఎస్పీ రవీందర్‌, డీటీఓ శివాజీ, గైడ్‌ విజయ్‌కుమార్‌, టూరిస్టు పోలీసులు అరుణ్‌, శ్రీకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement