క్లుప్తంగా
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తమ విద్యార్థినికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐక్యుఏసీ కోఆర్డినేటర్ జ్యోతి తెలిపారు. విద్యావారోత్సవాలలో భాగంగా మూడో రోజు ఉత్తమ విద్యార్థుల సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహమ్మద్ తబస్సంను కళాశాల అధ్యాపకులు సన్మానించారన్నారు. కొత్త సంవత్సరంలో అడ్మిషన్లు కాబోయే విద్యార్థుల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఏఈడీపీ కోర్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ వెంకటయ్య, కనీస్ ఫాతిమా, రాజశేఖర్, శ్రీకాంత్, సిబ్బంది శ్రీనివాస్, సురేష్, లక్ష్మి పాల్గొన్నారు.
వాజేడు: మండల కేంద్రంలోని ఐటీఐ, ఏటీసీలో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్స్‌పాల్ శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఐటీఐలో 40 సీట్లు, ఏటీసీలో 170 సీట్లు ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులను ఈ నెల 14 నుంచి జూన్ 8 వరకు చేసుకోవాలని తెలిపారు. 14 సవత్సరాల వయస్సు నిండి 10వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాల కోసం 82973 38888, 88975 20579 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
వాజేడు: మండలంలో ఇళ్ల గణన ముమ్మరంగా సాగుతుంది. మండల వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు ఇళ్ల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా రు. ఇందులో ఇంటి యజమానితో పాటు ఇళ్లు ఉన్నది లేనిది నమోదు చేస్తున్నారు. బుధవా రం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీలో ఇళ్ల గ ణనను సర్పంచ్ భరత్ కుమార్ పరిశీలించారు.
మహాముత్తారం: మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన దుర్గం సమ్మయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్నా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సునీల్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి బుధవారం వజినేపల్లిలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పూర్ణచందర్, నాయకులు రఫీ, దుర్గం తిరుపతి ఉన్నారు.
ఆర్డీఓకు సన్మానం
మల్హర్(కాటారం): మండలంలోని కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన రవీందర్‌ను బుధవారం ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పంతకా ని సమ్మయ్య, కొండగొర్ల రాంనారాయణ, ఆ త్మకూరి కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు
కేంద్రం ప్రారంభం
మహాముత్తారం: మండలంలోని బోర్లగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బోర్లగూడెం సర్పంచ్ అజ్మీరా ధరమ్‌సింగ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంచార్జి సీతునాయక్ ,రైతులుపాల్గొన్నారు.
వాజేడు: హనుమకొండలో మే 17న నిర్వహించనున్న తుడుందెబ్బ ఐక్యత సభను విజయవంతం చేయాలని కోరుతూ తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తొర్రెం సంతోష్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని కోయ వీరాపురంలో బుధవారం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ఐక్యత సభలో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. అనంతరం సభ కరపత్రాలను ఆవిష్కరించారు. తుడుందెబ్బ మండల కార్యదర్శి చేప లక్ష్మణ్, వాసం సంతోష్, తదితరులు ఉన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఏటూరునాగారం పరిధిలో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఇళ్లు ఉండి ఇంటి నంబర్ లేని యజమానులు నేరుగా గ్రామ పంచాయతీ దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటి నంబర్లు దరఖాస్తును స్థానిక పంచాయతీ కార్యదర్శికి అందజేసి వారి వివరాలను జతపర్చాలన్నారు. ఎవరికి ఎలాంటి లంచాలు, ప్రలోభాలకు లొంగకుండా నేరుగా వారి ఇంటినంబర్‌ను ప్రభుత్వ చాలన చెల్లించి పొందే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంటి నంబర్ లేక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నారని గుర్తించి ఇంటి నంబర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఇంటి యజమానికి పది రోజులలో నంబర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
రేగొండ: ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల దీవెనలు ప్రజలపైన నిండుగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదర్శన్, ఉపసర్పంచ్ ఆకుతోట తిరుపతి, నాయకులు పన్నాటి శ్రీనివాస్, రొంటాల వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
తునికాకు సేకరణ
మహాముత్తారం: మండలంలోని జీలపల్లి, మాదారం, మహాముత్తారం, సింగారం, యామన్‌పల్లి గ్రామాల్లోని గిరిజనులు, గిరిజనేతరులు నాలుగు రోజులనుండి గ్రామసమీపంలోని అడవుల్లో తునికాకు సేకరణ చేపడుతున్నారు. ఉదయం సేకరించిన ఆకును కట్టలు కట్టి కల్లోకి చేరవేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే యూనిట్లు టెండరయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో తునికాకు టెండర్లు కాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోతున్నారు.
ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు
మల్హర్: ప్రజలకు అన్నికాలాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మండలంలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నతాధికారులు గ్రామల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పని చేసి వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.
మండలంలో 8,495 జాబ్‌కార్డులు..
మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో 22 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉన్నాయి. వీటీలో కూలీల సంఖ్య 18,873 ఉండగా ఉన్నారు. మూడు రోజులుగా1600 పై చిలుకు కూలీలు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రతి రోజు ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకే కూలీలు పనులుకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. కొద్దిరోజులగా ఉపాధి హామీ పనులకు కూలీలు సంఖ్య పెంచడానికి ఉపాధిహామీ ఏపీఓ హరీష్, టీఏలు నిత్యం గ్రామాల్లోకి వెళ్లి జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనులకు రావాలని అవగాహన కల్పించారు. దీంతో రోజురోజుకూ కూలీల సంఖ్య పెరుగుతుంది.
వాజేడు: మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. గ్రామస్తులు బుధవారం ఊరుకట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో సుమారుగా రెండు గంటల పాటు గ్రామంలోని వారు బయటకు, బయటి గ్రామాల వారు ఊరిలోకి రాకుండా చూశారు.
మంగపేట: మండలంలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్వహణలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్న తిమ్మంపేటకు చెందిన లొంక రాజు, సాంబయ్య అనే ఇద్దరు వ్యక్తులు మల్లూరు గుట్టపై పురుగల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. విషయం తెలిసిన మంగపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పురుగుల మందు తాగిన వారిని 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, తాను తాగలేదని రాజు చెప్పడంతో సాంబయ్యకు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాంబయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. బాధితుడు రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమను అకారణంగా నెల రోజుల క్రితం విధులకు రానివ్వకుండా వేధిపులకు గురిచేశారని వాపోయాడు. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని మంత్రి సీతక్క వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నామని దీంతో రెండు రోజుల క్రితం తమను విధుల్లోకి రమ్మని చెప్పారన్నారు. కాని తమను విధులకు రావొద్దని మిషన్ భగీరథ కేవీఎన్‌ఆర్ కంపెని ఎండీ రాజిరెడ్డి మంగళవారం ఫోన్‌చేసి చెప్పాడన్నారు. దీంతో మనస్థాపం చెంది తాము ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుని మల్లూరుగుట్టపై గల మెయిన్ వాటర్ ట్యాక్ వద్దకు చేరి విషయాన్ని మిషన్ భగీరథ కేవీఎన్‌ఆర్ కంపెని ఎండీకి ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపాడు.
పనికి వెళ్తున్న 1634 మంది కూలీలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు


