ములుగు రూరల్: మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి బీఆర్‌ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగరవి యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు అయిన దగ్గర నుంచి కావాలనే కొంత మంది జిల్లా బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి సీతక్కపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. స్థాయిని మించి మాట్లాడుతున్న నాయకులకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె జైపాల్ రెడ్డి, చింతనిప్పుల భిక్షపతి, రీయాజ్ మీర్జా సుమన్ రెడ్డి, నల్లెల భరత్ కుమార్, యాసం రవికుమార్, కుక్కల నాగరాజు తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా
అధ్యక్షుడు వంగరవి యాదవ్


