వాజేడు: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల సాధన కోసం ఈ నెల 24న మండల కేంద్రంలో మహాగర్జన సదస్సును నిర్వహిస్తున్నట్లు గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి తెలిపారు. మండల పరిధిలోని కోయ వీరాపురం గ్రామంలో బుధవారం ఆయన ముఖ్య కార్యకర్తలు, ఆదివాసీ యువతతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మహా గర్జన సభలో ఆదివాసీ యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఆదివాసీ అస్తిత్వం, రక్షణ, చట్టాల అమలు కోసం యువతి, యువకులు ఉద్యమ బాట పట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్, సురేష్, సుధాకర్, రాజబాబు, నవీన్, లక్ష్మణ్‌తో పాటు తదితరులు ఉన్నారు.
గోండ్వానా సంక్షేమ పరిషత్
రాష్ట్ర కార్యదర్శి పూనెంసాయి


