ములుగు రూరల్: మహిళలు జీవనోపాధి పెంపొందించుకోవాలని సర్పంచ్ తప్పెట్ల రాజేందర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అబ్బాపూర్ గ్రామంలో ఆలీఫా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టత్మకమైన కార్యక్రమం కోటి మంది మహిళలు కోటిశ్వరులు అనే లక్ష్యంగా ఆఫాలీ స్వచ్ఛంద సంస్థ ఉచిత టైలరింగ్, బ్యూటీషన్ ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్ భరత్ ఉప సర్పంచ్ తిరుపతి, జిల్లా పారిశ్రమిక రంగం ఆఫీసర్ విక్రమ్ ప్రజ్వల్, ఎమ్‌ఐఎస్ కోఆర్డినేటర్ అక్కల రమేష్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుమత తదితరులు ఉన్నారు.
సర్పంచ్ రాజేందర్


