కొనసాగుతున్న పులుల గణన | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పులుల గణన

Feb 14 2026 9:09 AM | Updated on Feb 14 2026 9:09 AM

కొనసాగుతున్న పులుల గణన

కొనసాగుతున్న పులుల గణన

మంగపేట: మండలంలోని మంగపేట రేంజ్‌ పరిధిలోని ఈనెల 9 నుంచి వివిధ సెక్షన్ల పరిధిలో తాడ్వాయి ఫారెస్టు డివిజినల్‌ అధికారి వజ్రారెడ్డి పర్యవేక్షణలో అఖిలభారత పులుల గణన కొనసాగుతోంది. మేడారం మహాజాతర కారణంగా నిలిచి న కార్యక్రమాన్ని తిరిగి శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. గణన కార్యక్రమంలో భాగంగా మొదటి మూడు రోజులు శాఖాహారుల గణన, తర్వాత మూడు రోజులు మాంసాహారులు, పెద్ద శాఖాహారుల గణనకు కేటాయించామన్నారు. మంగపేట రేంజ్‌ పరిధిలో ఇన్‌చార్జ్‌ రేంజ్‌ అధికారి అశోక్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి కోటేశ్వర్‌, సుజాత, సెక్షన్‌ ఆఫీర్‌ హన్మ, రషీద్‌, రేంజ్‌ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారన్నారు. వణ్యప్రాణుల ఉనికి, వాటి సంఖ్య గుర్తించడానికి, పులి జాడ కోసం ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల ద్వారా పాదముద్రలు గుర్తులు, వాటి విసర్జతాల సేకరణ జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement