వీఐపీ లైన్‌లో సాధారణ భక్తులు
మేడారం (ఏటూరునాగారం): మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు తరలివచ్చి న భక్తులు క్యూలైన్ల వద్ద పోటెత్తారు. ప్రత్యేకంగా వీఐపీ క్యూలైన్లు ఏ ర్పాటు చేసినప్పటికీ సాధారణ భక్తులు సైతం వీఐపీ క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. సాధారణ భక్తులు వీఐ పీలు కాదా అంటూ అక్కడున్న పోలీసులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో సాధారణ భక్తులను సైతం వీఐపీ క్యూలైన్లలో దర్శనానికి అనుమతి ఇచ్చారు. అలాగే ఐటీడీఏ గెస్ట్‌హౌస్ ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డుపైకి వనదేవతలను దర్శించుకుని వస్తున్న భక్తులతో పా టు జంపన్నవాగు నుంచి గద్దెలకు వెళ్లే వారు రా వడంతో అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. చి న్నారులు, వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.


