
బాలసదనంలో దీపావళి సంబురాలు
ములుగు: ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ.సూర్యచంద్రకళ సందర్శించి పిల్లలతో ఘనంగా ముందస్తుగా దీపావళి సంబురాలు జరుపుకున్నారు. దీపావళి పండుగ గురించి పిల్లలకు వివరించి వారితో టపాసులు కాల్చి, పిల్లలకు స్వీట్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రంగోజు భిక్షపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, బాలసదనం సిబ్బంది పాల్గొన్నారు.