
మోడల్ బస్టాండ్ పనుల్లో వేగం పెంచాలి
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ బస్టాండ్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు శనివారం మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించి మాట్లాడారు. బస్టాండ్ నిర్మాణ పనుల్లో నాణత్య ప్రమాణాలు పాటించాలన్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయానికి ఆటంకం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పౌడాల ఓం ప్రకాశ్, నల్లెల్ల భరత్‌కుమార్ అహ్మద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.