మాస్టర్‌ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం

Oct 12 2025 6:35 AM | Updated on Oct 12 2025 6:35 AM

మాస్ట

మాస్టర్‌ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం

రానున్న రోజుల్లో ఏటూరునాగారం మున్సిపాలిటీ ఏర్పాటు

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: మాస్టర్‌ ప్లాన్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, రానున్న రోజుల్లో ఏటూరునాగారం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ.1 కోటితో నిర్మించనున్న పనులకు కలెక్టర్‌ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణితో కలిసి శనివారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రణాళికలు తప్పనిసరిగా తయారుచేసుకోవాలన్నారు. ఏటూరునాగారం గతంలో చిన్నపల్లెటూరుగా ఉండి.. ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడి 5 మండలాలకు కేంద్రంగా, రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఏర్పడిందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గతంలో ఏటూరునాగారం, ములుగు రెండు ప్రాంతాల మధ్య బస్సు డిపో విషయంలో సమస్య తలెత్తిందని ఈ విషయంపై సంబంధిత అధికారులు, రవాణా శాఖ మంత్రితో చర్చించి ఏటూరునాగారం ప్రాంతంలో రూ. ఏడున్నర కోట్లతో బస్‌డిపో ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం నుంచి గోదావరి నది వరకు రెండున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు మంజూరు చేసినట్లు వివరించారు. అందరి సహకారంతో ఏటూరునాగారం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రానున్న రోజులలో మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని వివరించారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో గ్రౌండ్‌, స్విమ్మింగ్‌పూల్‌ వంటి అభివృద్ధి పనులను చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఈఈ అజయ్‌ కుమార్‌, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, వావిలాల ఎల్లయ్య, లాలయ్య, సులేమాన్‌, గౌస్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తి క్రాస్‌ వద్ద చెన్నాపురం తోగులో రూ. 3 లక్షలు, జలగలంచ గొత్తికోయ గూడెంలో రూ. 3 లక్షలతో నిర్మించిన పాఠశాలలను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. అనంతరం మంతిర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జలగలంచ, చెన్నాపురం తోగు గొత్తికోయగూడెం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉండటం ద్వారా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ గొత్తికోయ పిల్లలకు చదువు అందించాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలలను నిర్మించి ప్రారంభించినట్లు తెలిపారు. 53 గొత్తికోయ హబిటేషన్‌ గూడేలలో సర్వే నిర్వహించి సోలార్‌ విద్యుత్‌కు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి చిన్నారులకు పలకలు, స్నాక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, డీపీఓ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

మాస్టర్‌ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం 1
1/1

మాస్టర్‌ ప్లాన్‌తోనే అభివృద్ధి సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement