
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(ఎం): స్వస్థ్‌నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకో వాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోని నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు వైద్య పరీక్షలు చేయించుకొని సంబంధించిన మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ విద్యారాణి మాట్లాడుతూ మహిళల్లో అత్యధికంగా రక్తహీనతతో బాధడుతున్నారన్నారు. శిబిరంలో 359 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, రిషిత, ఆర్బీస్‌కే మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు.