
విద్యార్థులకు వంట తిప్పలు
ఏటూరునాగారం: విద్యార్థులు వంట కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిది రోజులుగా హాస్టల్ విద్యార్థులకు వంట చేయడానికి వర్కర్స్ లేరని, దీంతో విద్యార్థులే వంట చేసుకోవడం, గదులు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వార్డెన్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓకు అందించారు. కార్యక్రమంలో నాయకులు వంశీ, అరవింద్, శ్రావణ్, సంతోష్, నర్సింగరావు, డీవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ములుగు రూరల్: గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల బాలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదుట నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. కార్మి కుల న్యాయమైన డిమాండ్‌లను పరిష్కారించా లన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సా యి, రోహిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.