
రామప్పలో సింగపూర్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సింగపూర్‌కు చెందిన దెవ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని సైతం దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని దెవ్ కొనియాడారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో అంగన్ వాడీ టీచర్లకు పోషణ్ అభియాన్‌పై శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు నిర్వహించారు. గురువారంతో ఈ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించాలని సీడీపీఓ ప్రేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగర్‌వాడీ సూపర్ వైజర్లు శ్రీవిద్య, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ములుగు రూరల్: సీనియర్ సిటీజన్లు తమ ఆస్తులను వారసులకు బదలాయించే సమయంలో నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వయోవృద్ధులు తమ ఆస్తులను పిల్లలకు, వారసులకు ఇచ్చే క్రమంలో తమ అవసరాలను తీర్చలేని క్రమంలో ఆస్తి బదలాయింపునకు అవకాశం ఉండే విధంగా మార్పిడి చేయాలని సూచించారు. సీనియర్ సిటీజన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23(ఏ) రద్దు చేయడానికి వీలు ఉంటుందని వివరించారు.
ములుగు రూరల్: జిల్లా లీగల్‌సెల్ కన్వీనర్‌గా రాజేందర్‌ను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ ఉమెన్ రైట్స్ అండ్ ఆర్‌టీఐ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా లీగల్ సెల్ సభ్యులకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
ములుగు రూరల్: జేడీ మల్లంపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ వేడుకలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు మొర్రి రాజుయాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఎంపీడీఓ అనితకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయించాలని కోరారు. మల్లంపల్లి మండలకేంద్రంలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల సంపత్, గణపతి, బొమ్మకంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థిని శ్వేత జిల్లాస్థాయి కబడ్డీ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కేజీబీవీ ఎస్‌ఓ నాగపూరి స్వప్న తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం కబడ్డీ అసోసియేషన్–భూపాలపల్లి ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగపూరి స్వప్న మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థిని ప్రోత్సహిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినిని అభినందించారు. ఆమె వెంట పీఈటీ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు.

రామప్పలో సింగపూర్ దేశస్తుడు

రామప్పలో సింగపూర్ దేశస్తుడు