
ఐసీడీఎస్‌ను భూస్థాపితం చేసేందుకు కుట్ర
ములుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్‌ను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియాన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క ఆరోపించారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను బండారుపల్లి మూలమలుపు వద్ద పోలీసులు భారీకేడ్లు పెట్టి సోమవారం అడ్డుకున్నారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క మాట్లాడారు. 50 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తున్న అంగన్‌వాడీలను ప్రీప్రైమరీ పేరుతో అంగన్‌వాడీలను దూరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రీ ప్రైమరీ విధులను అంగన్‌వాడీ కార్యకర్తలకే కేటాయించాలన్నారు. సంఘటన స్థలానికి సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్‌రావు చేరుకొని అంగన్‌వాడీ కార్యకర్తలతో మాట్లాడి సంబంధిత అధికారిని పిలిపించగా అధికారికి అంగన్‌వాడీలు వినతిపత్రం అందజేశారు.
యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క