
దోబూచులాడుతున్న గోదావరి
వరద నీటిలో మునిగిన మిర్చి చేనును చూపిస్తున్న రైతు నారాయణ బాబు
వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. గోదావరి వరద సోమవారం ఉదయం పెరిగి సాయంత్రానికి తగ్గింది. దీంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తోటలు ముంపునకు గురయ్యాయి. రుద్ర సత్యనారాయణ, రుద్ర నారాయణ బాబు, బోదెబోయిన నానబాబు, చిట్టి తిరుపతి రాజు, కొమరం రాములు, మరో రైతుకు చెందిన 14 ఎకరాల్లోని మిర్చి పంట నీట మునిగింది. అలాగే కొంగాల వాగు వరద నీరు రహదారిపైకి వచ్చి చేరింది. అయినప్పటికీ కొందరు వాహనదారులు నీటిలో నుంచే వచ్చి వెళ్లారు. మండల పరిధిలోని టేకులగూడెం సమీపంలో రేగుమాకు వాగు వద్ద గోదావరి వరద పరిస్థితిని వాజేడు ఎంపీడీఓ శ్రీకాంత నాయుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్ పరిశీలించారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీ 59గేట్లు ఎత్తివేత
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం వరకు 6,65,870 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరగా సాయంత్రం కాస్త తగ్గి 6,20,290 క్యూసెక్కులకు వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు బ్యారేజీ 59 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు వదులుతున్నారు.
పెరుగుతూ.. తగ్గుతున్న వరద
నీట మునిగిన మిర్చి చేలు

దోబూచులాడుతున్న గోదావరి

దోబూచులాడుతున్న గోదావరి

దోబూచులాడుతున్న గోదావరి

దోబూచులాడుతున్న గోదావరి