విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి

Sep 17 2025 7:43 AM | Updated on Sep 17 2025 7:43 AM

విద్య

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి

గోవిందరావుపేట: విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్‌ స్కూల్‌లో జిల్లాస్థాయి సైన్స్‌ సెమినార్‌ను మంగళవారం జిల్లా సైన్స్‌ అధికారి అప్పని జయదేవ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, సైన్స్‌పై మక్కువతో విద్యార్థుల్లో ప్రశ్నించే స్వభావం పెరుగుతుందన్నారు. క్వాంటం ఏజ్‌ బిగిన్స్‌ పొటెన్షియల్‌ ఛాలెంజెస్‌ అనే అంశంపై నిర్వహించిన సైన్స్‌ సెమినార్‌ విజేతలను డీఈఓ ప్రకటించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సెమినార్‌లో ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం.యశ్వంత్‌ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. రేపు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సెమినార్‌లో పాల్గొంటాడని వివరించారు. అనంతరం చల్వాయిలో తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్‌ కాటం మల్లారెడ్డి అధ్యక్షతన టీఎల్‌ఎం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. సృజనాత్మక బోధనకు టీఎల్‌ఎం(టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) ఎంతో ముఖ్యమని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ వినియోగిస్తూ విద్యార్థులకు బోధన చేయాలన్నారు. అత్యుత్తమమైన 8 మంది ఉపాధ్యాయులు మెటీరియల్‌తో బోధిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వివరించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారిలో సీహెచ్‌.మహేందర్‌, యశస్వీని, టి.సంధ్యారాణి, పూర్ణిమ, రాజశేఖర్‌, టి.రాజేశ్‌ కుమార్‌, ఏ.వెంకటేశ్‌, మహేందర్‌ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్‌ కాటం మల్లారెడ్డి, ఏటూరునాగారం మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య, ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ గండు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనాన్ని అందించాలి

వెంకటాపురం(ఎం): విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన నిర్వహకులకు డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుతీరు, మధ్యాహ్న భోజన వివరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, టీచర్‌ డైరీ, బేస్‌ లైన్‌, ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ ఫలితాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్‌ సాంబయ్య, హెచ్‌ఎం రాధిక, ఉపాధ్యాయులు బాబురావు, సంధ్యారాణి, కిశోర్‌బాబు, అంబేద్కర్‌, మహేష్‌లు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి1
1/1

విద్యార్థులు సైన్స్‌పై మక్కువ పెంచుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement