
మొదటి నిమిషమే డైమండ్ అవర్
ములుగు: మోసపోయిన మొదటి నిమిషమే డైమండ్ అవర్ అని బాధితులు హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేస్తే వెంటనే సంబంధిత సొమ్మును రికవరీ చేసేందుకు, నేరస్తుల అకౌంట్‌ను హోల్డ్‌లో పెడుతామని ములుగు సైబర్ క్రైమ్ డీఎస్పీ నందిరాం నాయక్ తెలిపారు. సైబర్ క్రైం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సైబర్ వలలో చిక్కుకుని మోసపోయిన బాఽధితులు వెంటనే హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. మొదటి గంటలోపు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే సొమ్మును రికవరీ చేసేందుకు 100శాతం అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగుల, వ్యాపారస్తుల డేటాను సేకరించి వారికి అనుసంధానంగా ఉన్న ఏపీకే ఫైళ్లను పంపుతున్నారని తెలిపారు. దీంతో ఫైల్స్ ఓపెన్ చేసి నష్టపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 5 నుంచి 10 కోట్ల రూపాయలను సైబర్ నేరస్థుల చేతిలో బాధితులు పోగొట్టుకుంటున్నారని వివరించారు. అనవసరమైన ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేసి నష్టం జరిగితే బాధితులు 1930 కాల్ చేస్తే తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కి వెళ్తుందన్నారు. వెంటనే సిబ్బంది స్పందించి పోలీసుల అంతర్గత సైట్ ద్వారా డబ్బులు వెళ్లిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తారని వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయేది ఎక్కువ మంది విద్యావంతులేనని తెలిపారు. ప్రజలు అనవసరమైన లింకుల జోలికి వెళ్లవద్దని డీఎస్పీ వివరించారు.
బాధితులు 1930 కాల్ చేస్తే అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం
సైబర్ క్రైం డీఎస్పీ నందిరాంనాయక్