
జీఓ నంబర్ 64ను రద్దు చేయాలి
ములుగు: జీఓ నంబర్ 64ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ సర్క్యూలర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియాన్ ఆధ్వర్యంలో వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడారు. వర్కర్లకు జీతాలు తగ్గించాలని ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అనంతరం ఆదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు రాజు, యాకలక్ష్మి, స్రవంతి, రాజమ్మ, సమ్మక్క, వసంత, శారద, భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
కలెక్టరేట్ ఎదుట డైలీ వేజ్ వర్కర్ల ధర్నా