
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్‌లతో డ్యాన్స్‌లు చేసి సందడి చేశారు. హనుమకొండ డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, రమాదేవి భక్తులకు సేవలందించారు.

మేడారంలో భక్తుల సందడి