
పెరుగుతున్న గోదావరి
కన్నాయిగూడెం: జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉరకలేస్తోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 6,15,780 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగితే పంట నీటమునిగే ప్రమాదం ఉంది.
సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి
భారీగా వరద నీరు
59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీరు