
గుంతలమయంగా రహదారులు
ఏటూరునాగారం: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. 163వ జాతీయ రహదారి ఛత్తీస్‌గఢ్ వైపు, భద్రాచలం–మంగపేట రోడ్డు, వరంగల్– ఏటూరునాగారం రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచి కంకర, బీటీ కొట్టుకుపోయి ఫీటు లోతు గుంతలు పడడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు అన్నట్లుగా మారాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ఆశ్రమ పాఠశాల ఎదురుగా రోడ్డుపై గుంతలు పడడంతో వాహనాలు పాఠశాల వైపు నుంచి రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదకరంగా మారింది, రామన్నగూడెం గ్రామం, రాంనగర్ –కమలాపురం గ్రామాల మధ్యలోని రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా బ్రిడ్జి
163 జాతీయ రహదారిలో జంపన్నవాగు మూడు బ్రిడ్జిలకు ఇరువైపులా నీరు, గడ్డి, ఇసుక నిలిచి ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ అధికారులు బ్రిడ్జిపై నిలిచిన నాచు, నీటిని తొలగించకపోవడం అధికారుల పనితనానికి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
వాహనదారులు, ప్రయాణికులకు తప్పని తిప్పలు
ప్రమాదకరంగా
జంపన్నవాగు బ్రిడ్జిపైన రోడ్డు
కొట్టుకుపోయిన కన్నాయిగూడెం రోడ్డు
ఆదమరిస్తే అంతే..
కన్నాయిగూడెం నుంచి భూపతిపూర్ వెళ్లే ప్రధాన రోడ్డు, ఛత్తీస్‌గఢ్– తెలంగాణ సరిహద్దు ప్రధాన రోడ్లు కోతలకు గురయ్యాయి. ఎస్‌ఎస్ తాడ్వాయి సమీపంలోని కొండపర్తి, జనగలంచ సమీపంలో కాజ్‌వే వద్ద కోతకు గురై మట్టి ఒర్లిపోయింది. వాహనదారులు దారి వెంట వెళ్లే సమయంలో భయంభయంగా ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది.

గుంతలమయంగా రహదారులు

గుంతలమయంగా రహదారులు

గుంతలమయంగా రహదారులు

గుంతలమయంగా రహదారులు