
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలు
కాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్‌లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్‌లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్‌ను రోల్‌మెడల్‌గా తీసుకుంటున్నారు.
కల్లెడ గడి ముఖద్వారం
వసతులు ఘనం.. అతి పెద్ద భవనం
చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు
పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద
కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథ
శతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం