
బడికి రాకుంటే ఊరుకునేదే లేదు..
ఏటూరునాగారం: మండల పరిధిలోని నార్త్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పోతు రాజశేఖర్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలకు విద్యార్థులు డుమ్మా కొడితే ఊరుకునేదే లేదు.. ఎట్లాగైనా బడికి తీసుకురావాలే.. అనే సంకల్పంతో ఇంటింటికి తిరిగి పిల్లలను బడికి తీసుకొస్తాడు. ఈ ఏడాది 25 మంది విద్యార్థులను కొత్తగా అడ్మిషన్ చేయించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం ఈ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. అంతేకాకుండా అందులో 16 మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలను బోధిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాడు.