
ఆదర్శం యాదలక్ష్మి
గోవిందరావుపేట: మండల పరిధిలోని గాంధీనగర్ యూపీఎస్ పాఠశాలలో యాదలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా పాఠశాలలో విద్యార్థులు లేని పరిస్తితి ఉంది. దీంతో పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా అడుగుపెట్టినప్పటి నుంచి పెను మార్పులు తీసుకొచ్చారు. తన సొంత ఖర్చులతో భవనానికి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల ఇంటింటికీ తిరిగారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులను బడిలో చేర్పించారు. వారికి షూస్‌తో పాటు స్టడీ మెటీరియల్ అందజేసి వినూత్న రీతిలో బోధిస్తూ ఆదర్శంగా నిలిస్తోంది.