
గొత్తికోయగూడెంపై దాడి
శాంతినగర్‌లో అటవీశాఖ అధికారులు కూల్చిన గుడిసె
మంగపేట: మండల పరిధిలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతం సమీపంలోని శాంతినగర్ గొత్తికోయగూడెంపై మంగపేట అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో దాడి జరిగింది.
ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..అటవీ ప్రాంతంలోని శాంతినగర్‌లో పదేళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 15 పైగా గొత్తికోయ గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా గూడెంపై దాడికి దిగి తొమ్మిదికి పైగా గుడిసెలను కూల్చివేసి అడ్డువచ్చిన అమాయక గొత్తికోయ గిరిజనులపై దాడి చేసి గాయపరిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్‌ను వివరణ కోరగా మంగపేట బీటు పరిధిలోని అటవీప్రాంతంలో శాంతినగర్‌లో కొత్తగా పోడుచేసి అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా 20 రోజుల క్రితం స్థానిక పోలీసులతో కలిసి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఉండాలని కొత్తగా పోడు చేయొద్దని, గుడిసెలు వేయవద్దని హెచ్చరించామని వివరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా నూతనంగా గుడిసెలు వేసినట్లు తెలిసిందన్నారు. దీంతో సాయంత్రం 3 గుడిసెలను తొలిగించినట్లు వివరించారు.
గిరిజనులపై దాడి, గుడిసెలు కూల్చేసిన
అటవీశాఖ అధికారులు

గొత్తికోయగూడెంపై దాడి