నిమజ్జనానికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వేళాయె..

Sep 5 2025 7:34 AM | Updated on Sep 5 2025 7:34 AM

నిమజ్

నిమజ్జనానికి వేళాయె..

నిమజ్జనానికి వేళాయె..

నిమజ్జనం చేసే ప్రాంతాలివే..

నేడు వినాయక నిమజ్జనం

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలి

ములుగు: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి నేడు ప్రజలు వీడ్కోలు పలకనున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పోలీసు అధికారులు సంయుక్తంగా కలిసి వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. భక్తులు చెరువుల్లోకి దిగకుండా ప్రధాన చెరువుల వద్ద గ్రామ పంచాయతీ, పోలీస్‌ అధికారులు క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ దివాకర, డీపీఓ దేవరాజ్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు.

రామప్ప, లక్నవరం సరస్సుల్లో

అనుమతి లేదు..

వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండల పరిధిలోని లక్నవరం జలాశయం వంటి ప్రధాన చెరువుల్లో వినాయక నిమజ్జనానికి పోలీసు శాఖ అనుమతులు నిరాకరించింది. నిమజ్జనం సమయంలో యువకులు సరస్సుల్లో దిగి మృత్యువాత పడతారనే నెపంతో నిమజ్జనం చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాలను ఆయా మండలాలకు చెందిన పోలీసు అధికారులు గురువారం పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భారీ బందోబస్తు

జిల్లాలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి 400 మంది సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌పీఎస్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 800కు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. నిమజ్జన ప్రక్రియ మొదలు నుంచి పూర్తి అయ్యేంత వరకు పూర్తి కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ ఫీల్డ్‌ అధికారులు పరిశీలించనున్నారు. ములుగు సబ్‌ డివిజన్‌ డీఎస్పీ రవీందర్‌, ఏటూరునాగారం సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలనలో నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది.

జిల్లాలో ప్రధానంగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలోని తోపుకుంట, మల్లంపల్లి మండలంలో ఊర చెరువు, వెంకటాపురం(ఎం) మండలంలో నల్లకాలువ, గోవిందరావుపేట మండలంలోని గౌరారం చెరువు, రంగాపూర్‌ కాల్వ, ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలో జంపన్నవాగు, కన్నాయిగూడెం మండలంలో తుపాకుల గూడెం సమ్మక్క సాగర్‌ బ్యారేజీ, వెంకటాపురం(కె) మండలంలో పాలెం వాగు వద్ద, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాలకు చెందిన వారు ఏటూరునాగారం ముళ్లకట్ట పూసూరు బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనానికి క్రేన్లు, జేసీబీలను వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం ప్రాంతంలో లైటింగ్‌ ఏర్పాటు, విద్యుత్‌కు అంతరాయం కలిగితే జనరేటర్లను సైతం వినియోగించేలా చర్యలు చేపట్టారు. ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

చెరువులు, వాగుల వద్ద ఏర్పాట్లు

జిల్లాలో 800కు పైగా గణపతి విగ్రహాలు

400 మంది పోలీసులతో బందోబస్తు

రామప్ప, లక్నవరం చెరువుల్లో

అనుమతి నిరాకరణ

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రహదారులు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. శోభాయాత్ర భక్తిభావంతో శాంతియుతంగా సాగేలా ఉత్సవ కమిటీ సభ్యులు చూసుకోవాలి. గ్రామాలలో ప్రజల సంరక్షణకు స్థానిక పోలీసు బృందాలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తాయి. నిమజ్జనం సమయంలో స్థానిక పోలీసులకు ప్రజలు సహకరించాలి.

– డాక్టర్‌ శబరీశ్‌, ఎస్పీ

నిమజ్జనానికి వేళాయె..1
1/4

నిమజ్జనానికి వేళాయె..

నిమజ్జనానికి వేళాయె..2
2/4

నిమజ్జనానికి వేళాయె..

నిమజ్జనానికి వేళాయె..3
3/4

నిమజ్జనానికి వేళాయె..

నిమజ్జనానికి వేళాయె..4
4/4

నిమజ్జనానికి వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement