
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఏటూరునాగారం/మంగపేట: మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని మీసేవ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మింకగా తనిఖీ చేశారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అతి త్వరలో ఏటూరునాగారంలో నూతన ఆధార్ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మంగపేట మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను తహసీల్దార్ రవీందర్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్‌లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడి నుంచి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజన్ చార్టర్, భూ భారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, మీసేవ సెంటర్ నిర్వహకులు పాల్గొన్నారు.
ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్