
యూరియా కోసం పడిగాపులు
ఏటూరునాగారం: యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాలను కొనుగోలు చేసేందుకు రైతులు గురువారం ఉదయం నుంచి బారులుదీరారు. ఒక్కో రైతు ఆధార్ కార్డుపై రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో అవసరం ఉన్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్‌లు సిబ్బందితో కలిసి బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది రైతులు బస్తాలు క్యూలో నిలబడ్డారు. అయితే రైతుల మాత్రం తమకు రెండు బస్తాలు సరిపోవని ఎక్కువ ఇవ్వాలని అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చే అనుమతి ఉందని ఏఓ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్తాలను చిన్నబోయినపల్లి తో పాటు షాపెల్లి, గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, కొండాయి, దొడ్ల, మల్యాల తదితర గ్రామాల రైతులకు మాత్రమే అందజేశారు.
ఒక్కో రైతుకు రెండు బస్తాలు పంపిణీ

యూరియా కోసం పడిగాపులు