● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్ : దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాగతిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, రాష్ట్ర నాయకుడు పల్ల బుచ్చయ్య అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకేసారి ఎన్నికల జరగడం వల్ల ఆర్థికంగా, అభివృద్ధిపరంగా, ప్రజాధనం దుర్వినియోగం, ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగడంతో సమర్ధవంతమైన నాయకులను ఎన్నుకునేందుకు వీలుంటుందని అన్నారు. ఎన్నికల కోడ్ ఆంక్షలు లేకుండా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు పనులపై దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కారానికి వీలుంటుందని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికను స్వాతిస్తూ గ్రామాలు, మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా యువత, మేధావులు భాగస్వామ్యంతో ప్రజలలను చైతన్యపరచాలని అన్నారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహార్‌లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రాచారి, ఇమ్మడి రాకేష్‌యాదవ్, కృష్ణాకర్‌రావు, నరేష్, రామరాజు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.