
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారంలో కురుస్తున్న వర్షం
బురదమయంగా రోడ్లు
ఏటూరునాగారం: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లు బురదమయంగా మారాయి. రోడ్లు సమాతరంగా లేకపోవడంతో పాటు సైడ్ డ్రైయినేజీలు సరిగా లేకపోవడం వల్ల పడిన వర్షం నీరు ఎటు వెళ్లలేక రోడ్లపైనే నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రయాణికులు, బాటసారులు, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐలాపురం వెళ్లే రోడ్డు మట్టిరోడ్డు కావడంతో వాహనాలు దిగబడుతుండడంతో ట్రాక్టర్‌పైనే ప్రయాణించాల్సి వస్తోంది. ద్విచక్రవాహనాలు, ఫోర్ వీలర్స్ కూడా బురదలో దిగబడుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.

ఏజెన్సీలో భారీ వర్షం

ఏజెన్సీలో భారీ వర్షం