ఓటీటీలో ఫుల్‌ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | Yogi Babu Boomer Uncle Telugu Movie OTT Date locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ఫుల్‌ కామెడీ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Jul 16 2024 7:00 PM | Updated on Jul 16 2024 7:28 PM

Yogi Babu Boomer Uncle Telugu Movie OTT Date locked

కోలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన చిత్రం  'బూమర్‌ అంకుల్‌'. కోలీవుడ్‌లో మార్చి 29న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. స్వదీస్‌ ఎమ్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓవియా, రోబో శంకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఇప్పటి వరకూ తమిళ్‌లో అందుబాటులో ఉన్న  'బూమర్‌ అంకుల్‌' సినిమా తెలుగులో జులై 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు తెలుగు ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.  బూమర్ అంకుల్ గట్టిగా నవ్విస్తాడంటూ స్ట్రీమింగ్ డేట్‌ను తమ సోషల్‌ మీడియా ఖాతాలో  ఆహా వెళ్లడించింది. 

ఇందులో నేసమ్‌ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులుగా కనిపిస్తారు. విదేశీ యువతి అమీతో నేసమ్‌కు పరిచయం ఏర్పడటం.. ఆపై పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కానీ వారు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకున్నారు..? విడాకులు కావాలనుకున్న నేసమ్‌కు తన సతీమణి ఎలాంటి కండీషన్‌ పెడుతుంది..? వంటి అంశాలను జులై 20న అహాలో చూడండి.

Advertisement
 
Advertisement
Advertisement