ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..! | Sakshi
Sakshi News home page

Theatre and OTT In This Week: ఈ వారం సందడి చేయనున్న సినిమాలివే..!

Published Mon, Feb 6 2023 6:34 PM

This Week Theatre and OTT Release Movies In Tollywood - Sakshi

జనవరిలో సంక్రాంతి సినిమాల సందడి ముగిసిపోయింది. పెద్ద హీరోల చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఫిబ్రవరిలోనూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధమైపోయాయి. ఈ వారంలో కల్యాణ్ రామ్ అమిగోస్ విడుదలవుతోంది. అలాగే ఈ వారంలో థియేటర్లతో పాటు ఓటీటీకి వచ్చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

కల్యాణ్‌రామ్‌ అమిగోస్

నందమూరి కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 10న రిలీజ్ చేయనున్నారు. 

 కన్నడ మూవీ వేద

కన్నడ హీరో శివ రాజ్‌కుమార్‌ 125వ చిత్రం వేద. అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా నిర్మితమైంది. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్‌ కానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది.

పాప్‌కార్న్‌

 ఆవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం పాప్ కార్న్. ఈ చిత్రానికి  శ్రవణ్ భరద్వాజ్‌ సంగీతమందించగా.. భోగేంద్రగుప్త నిర్మించారు.  మురళీగంధం  దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. 

ఐపీఎల్‌: ఇట్స్‌ ప్యూర్‌ లవ్‌

విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఐపీఎల్. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. బీరం శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది.

 దేశం కోసం భగత్‌ సింగ్‌ 

రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్‌, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దేశం కోసం భగత్ సింగ్. ఈ సినిమాకు రవీంద్ర గోపాల  దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటరల్లో సందడి చేయనుంది.  

చెడ్డి  గ్యాంగ్ తమాషా

సిహెచ్ క్రాంతి కిరణ్  నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.  అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్,  శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మించారు. 

ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

 • తునివు/తెగింపు- ఫిబ్రవరి 8, 2023

డిస్నీ+హాట్‌స్టార్‌

 •  రాజయోగం- ఫిబ్రవరి 09, 2023


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • వెబ్‌సిరీస్‌: ఫర్జీ- ఫిబ్రవరి 10, 2023 

ఆహా

 కళ్యాణం కమనీయం- ఫిబ్రవరి 10, 2023 

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు

నెట్‌ఫ్లిక్స్‌

 •     బిల్‌ రస్సెల్‌: లెజెండ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 8
 •     ద ఎక్స్ఛేంజ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8
 •     యు (వెబ్‌సిరీస్‌-4) ఫిబ్రవరి 9
 •     డియర్‌ డేవిడ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 9
 •     యువర్‌ ప్లేస్‌ ఆర్‌ మైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10
 •     టెన్‌ డేస్‌ ఆఫ్‌ ఎ గుడ్‌మాన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10

డిస్నీ+హాట్‌స్టార్‌

 •     నాట్‌ డెడ్‌ ఎట్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 09
 •     హన్నికాస్‌ లవ్‌ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10

సోనీలివ్‌

 •     నిజం విత్‌ స్మిత (టాక్‌ షో) ఫిబ్రవరి 10


 

Advertisement
 
Advertisement
 
Advertisement